అక్టోబర్ 01 చరిత్రలో ఈరోజు

దినోత్సవం :

  • ప్రపంచ శాఖాహార దినోత్సవం
  • ప్రపంచ వృద్ధుల దినోత్సవం .
  • జాతీయ రక్తదాన దినోత్సవం.
  • సైప్రస్, నైజీరియా, తువాలు, పలౌ స్వాతంత్ర్య దినోత్సవం.
  • ప్రపంచ ఆవాస దినోత్సవం.
  • స్వచ్ఛంద రక్తదాన దినం.
  • అంతర్జాతీయ సంగీత దినం

సంఘటనలు :

1953: కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ.
1958: భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబర్ 1958 న ప్రవేశ పెట్టారు. డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న ‘డబ్బు’, ‘రూపాయి’ లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్) ) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.
1982 తొలి CD ప్లేయర్ ను సోని లాంచ్ చేసింది.
1984 : బజరంగ్ దళ్ అనేది ఒక హిందూ మత సంస్థ. బజరంగ్ దళ్ స్థాపన.
1997: జనరల్ వి.పి. మాలిక్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
2000: జనరల్ ఎస్.ఆర్. పద్మనాభన్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం

జననాలు :

1847: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933)
1862: రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939)
1890: అంకితం వెంకట భానోజీరావు, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కింగ్ జార్జి ఆసుపత్రుల నిర్మాణానికి భూమిని దానం చేసిన వితరణశీలి.
1908: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974)
1915: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (మ.2013)
1921: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (మ.1974)
1922: అల్లు రామలింగయ్య, హాస్య నటుడు. (మ.2004)
1934: భువన్ చంద్ర ఖండూరి, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
1934: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్త. (మ.2014)
1939: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015)
1942: బోయ జంగయ్య, రచయిత. (మ.2016)
1951: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (మ.2002)
1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు
1901: ప్రతాప్ సింగ్ ఖైరాన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

మరణాలు :

1939: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (జ.1784)
1946: గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. (జ.1902)
1975: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత. (జ.1912)
1979: పి.వి.రాజమన్నార్, న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (జ.1901)

Follow Us @