నవంబర్ 05 చరిత్రలో ఈరోజు

సంఘటనలు

1556: రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బరు సైన్యం హేమును ఓడించిన రోజు. అప్పటికి అక్బరుకు పదమూడేళ్లు. సైన్యాధ్యక్షుడు బైరాంఖాన్‌ ఆధ్వర్యంలో మొఘలులకు ఈ విజయం సొంతమైంది.
1605: బ్రిటిష్‌ పార్లమెంటు భవనాన్ని పేల్చివేసేందుకు రోమన్‌ క్యాథలిక్కులు పన్నిన కుట్ర విఫలమైన రోజు. దీన్నే ‘గన్‌పౌడర్‌ ప్లాట్‌’ అంటారు. ‘గై ఫాకెస్‌’ అనే వ్యక్తి పేలుడు సామగ్రితో పార్లమెంటు లోపలికి వెళ్తుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. నాటి నుంచి ఏటా నవంబర్ 5న ఇంగ్లండ్‌లో బాణాసంచా కాల్చి ‘గై ఫాకెస్‌ డే’గా జరుపుకుంటారు.
1895: జార్జ్‌ సెల్డెన్‌ రూపొందించిన గ్యాసోలిన్‌తో నడిచే ఇంజిన్‌కు పేటెంటు హక్కులు లభించాయి. అమెరికన్‌ ఆటోవెుబైల్‌ రంగానికి సంబంధించినంత వరకూ ఇదే మొదటి పేటెంటు.
1920: భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది.
1951: పశ్చిమ, మధ్య రైల్వేలు ముంబయిలో ఏర్పాటయ్యాయి.
1967: ఏటీఎస్‌-3 కృత్రిమ ఉపగ్రహాన్ని అమెరికా ప్రయోగించింది. రోదసి నుంచి పూర్తిస్థాయిలో భూమి ఛాయాచిత్రాలను తీసిన మొదటి ఉపగ్రహం అది.
1976: ఎమర్జెన్సీ కాలం. లోక్‌సభ పదవీకాలం ముగిసినా, మరో సంవత్సరం పాటు ఈ కాలాన్ని తనకు తానే పొడిగించుకుంది.
1977: భారత విదేశ వ్యవహారాల శాఖా మంత్రి, అటల్ బిహారీ వాజపేయి, ఐక్యరాజ్యసమితిలో హిందీ లో ప్రసంగించాడు.
1976: భారత లోక్‌సభ స్పీకర్‌గా భలీరామ్ భగత్ పదవిని స్వీకరించాడు.
1989: అంతర్జాతీయ ఒకరోజు క్రికెట్ పోటీల్లో బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండూల్కర్ అరంగేట్రం.

జననాలు

1877: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (మ.1950)
1892: జె.బి.ఎస్‌. హాల్డేన్‌, బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త. (మ.1964)
1925: ఆలూరి బైరాగి, తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది. (మ.1978)
1952: వందన శివ, ఒక తత్త్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ, స్త్రీవాద రచయిత్రి.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

మరణాలు

1972: సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (జ.1925)
1987: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (జ.1925)
1993: నల్లా నరసింహులు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు. (జ. 1926)
1995: ఇల్జక్ రాబిన్, ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి.
2019: కర్నాటి లక్ష్మీనరసయ్య నటుడు, ప్రయోక్త, దర్శకుడు, జానపద కళాకారుడు. (జ.1927)

Follow Us @