నవంబర్ 12 చరిత్రలో ఈరోజు

సంఘటనలు

1766: సలాబత్‌ జంగును అతని సోదరుడు నిజాం ఆలీ ఖాను కూలదోసి, రాజమండ్రిని, శ్రీకాకుళాన్ని హసన్‌ ఆలీ ఖానుకు లీజు కిచ్చాడు. రాబర్టు క్లైవు మొగలు చక్రవర్తి షా ఆలంతో సంప్రదించి, ఉత్తర సర్కారులను ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ధారాదత్తం చేసినట్లుగా ఆగస్టు 1765లో ఫర్మానా తెప్పించాడు. కాని దానిని మార్చి 1766 వరకు రహస్యంగా ఉంచాడు. బ్రిటిషు వారు కొండపల్లి దుర్గాన్ని ఆక్రమించారు. అవసరమైతే సైనిక చర్య చేపట్టడానికై జనరలు సిల్లాడ్‌ను మచిలీపట్నం పంపించారు. నిజాము కూడా శీఘ్రంగా యుద్ధ సన్నాహాలు చేసాడు. నవంబర్‌ 12, 1766 న కుదిరిన ఒక ఒప్పందం వలన యుద్ధం తప్పింది. ఉత్తర సర్కారులకు ప్రతిఫలంగా, కంపెనీ, నిజాము సహాయార్థం సైన్యాన్ని పోషిస్తుంది తూర్పు గోదావరి జిల్లా చరిత్ర
1969: రాష్ట్రపతి ఎన్నికలో స్వంత పార్టీ యొక్క అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా వి.వి.గిరిని గెలిపించిన ఇందిరా గాంధీని పార్టీ నుండి బహిష్కరించగా, కొత్తపార్టీ, కాంగ్రెస్ (ఐ) ని ఏర్పాటు చేసింది. తరువాతి కాలంలో ఇదే భారత జాతీయ కాంగ్రెసుగా గుర్తింపు పొందింది.
1996: హర్యానా లోని భివాని వద్ద ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో 350 మంది మరణించారు.

జననాలు

1885: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (మ.1932])
1920: పెరుగు శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని నేత్రవైద్య నిపుణుడు., ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారుగా, దేశ ప్రథమ పౌరుడి (రాష్ట్రపతి) కి గౌరవ నేత్ర చికిత్సకులుగా నియమితులయ్యారు,
1925: పసుమర్తి కృష్ణమూర్తి, చలనచిత్ర నృత్యదర్శకుడు. (మ.2004)
1929: సి.వి.సుబ్బన్న, శతావధాని (మ.2017)

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

మరణాలు

మదన్ మోహన్ మాలవీయ
1946: మదన్ మోహన్ మాలవ్యా, భారత స్వాతంత్ర్యయోధుడు. (జ.1861)
1986: భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, భారతదేశ సుప్రీంకోర్టు ఆరవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1899)
1994: విల్మా రుడాల్ఫ్, ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (జ.1940)
2012: చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు, స్వాతంత్ర్యసమరయోధులు. 1800 ఎకరాలు దానం చేసిన దాత
2018: అనంతకుమార్, కేంద్ర మంత్రి, కేన్సరు కారణంగా చనిపోయారు. (జ.1959).
2020: ఏడిద గోపాలరావు, ఆకాశవాణి కళాకారుడు.

Follow Us @