◆ దినోత్సవం
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
ప్రపంచ రోగి భద్రతా దినము
◆ సంఘటనలు
1966: ఐదవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి.
2009: అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు.
◆ జననాలు
1742: కార్ల్ విల్‌హెల్మ్ షీలే జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (మ.1786)
1908: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1995)
1913: హొమాయ్ వ్యరవాలా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (మ.2012)
1934: అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (మ.2000)
1946: సోనియా గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు.
◆ మరణాలు
1986: వల్లూరి బసవరాజు, హేతువాది, ఆంధ్ర మహాసభ కార్యకర్త, అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు.
1986: వెదిరె రామచంద్రారెడ్డి, భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి (జ. 1905)
2013: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1914)