గొల్లపల్లి మోడల్ స్కూల్ లో టీచర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

జగిత్యాల :: జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మోడల్ స్కూల్లో పీజీటీ విభాగంలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ బోధించుటకు ఉపాధ్యాయ పోస్టుకు అర్హులైన వారు అక్టోబర్ 30 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ కోరారు.

పీజీటీకి అర్హతగా సంబంధిత సబ్జెక్ట్ లో పీజీతోపాటు, బీఈడీ కల్గి ఉండాలని ప్రిన్సిపాల్ తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ – 30