జగిత్యాల (జూలై – 19) : తెలంగాణ ఇంటర్మీడియట్ కమీషనర్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులను అతిధి అధ్యాపకుల చేత భర్తీ చేయడానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న 51 పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం – సమీకృత కలెక్టర్ కార్యాలయం,. రూమ్ నంబర్ 125 యందు జూలై 24 సాయంత్రం 5.00 గంటల లోపల దరఖాస్తు చేసుకోగలరు. పది నుంచి పీజీ వరకు సర్టిఫికెట్ లు, కులం, లోకల్ ఏరియా సర్టిఫికెట్ లు సమర్పించాలి.
పీజీ లో సాదించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు సంబంధించిన కళాశాలలో ఆగస్టు 01 – 2023 న రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Comments are closed.