1,654 గెస్ట్ జూనియర్ అధ్యాపకుల నియామాకానికి ఉత్తర్వులు

హైదరాబాద్ (జూలై – 19) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న 1,654 జూనియర్ అధ్యాపక పోస్టులను గెస్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది.

నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడానికి లోకల్ మీడియాలో ఖాళీలతో కూడిన వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ ప్రకటన జారీ చేయాల్సి ఉంటుంది.

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రిన్సిపాల్ లతో కూడిన ముగ్గురు తో కూడిన కమిటీ గెస్ట్ జూనియర్ లెక్చరర్ లను ఎంపిక చేయనుంది.

అభ్యర్థులు దరఖాస్తును DIEO/ జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారికి చేసుకోవాలి. సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెరిట్ ఆధారంగా పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేయాల్సి ఉంటుంది.

వచ్చిన దరఖాస్తులలో 1:3 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసిన జాబితా ను సెలక్షన్ కమీటికి DIEO/NODAL OFFICER సమర్పించాల్సి ఉంటుంది.

వీరి సేవలను మార్చి /ఏప్రిల్ -2024 వరకు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు.