GUEST JUNIOR LECTURER JOBS : మహబూబ్‌నగర్ జిల్లా నోటిఫికేషన్

మహబూబ్‌నగర్ (జూలై – 19) : తెలంగాణ ఇంటర్మీడియట్ కమీషనర్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులను అతిధి అధ్యాపకుల చేత భర్తీ చేయడానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికా‌రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న 56 పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

అడ్డాకుల-2, బాలానగర్-3, దేవరకద్ర-5, కోయిలకొండ-1, జడ్చర్ల(బాలికలు)-6, జడ్చర్ల-1, మిడ్జిల్-3,.మహబూబ్ నగర్(ఎంవీఎస్)-6, మహబూబ్ నగర్(బాలుర)-8,. మహబూబ్ నగర్(బాలికల)-11, మహబూబ్ నగర్ ఒకేషనల్-6, ఎన్మన్గండ్ల- 4 చొప్పున ఖాళీలు కలవు.

పీజీ‌ అర్హత కలిగిన అభ్యర్థులు మహబూబ్‌నగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికా‌రి కార్యాలయం యందు జూలై 24 సాయంత్రం 5.00 గంటల లోపల దరఖాస్తు చేసుకోగలరు.

పదో తరగతి నుంచి పీజీ వరకు సర్టిఫికెట్ లు, కులం & లోకల్ ఏరియా సర్టిఫికెట్ లతో దరఖాస్తు ఫారం సమర్పించాలి.

కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రిన్సిపాల్ లతో కూడిన కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

పీజీ లో సాదించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు సంబంధించిన కళాశాలలో ఆగస్టు 28 నాడు ఎంపిక జాబితా విడుదల చేయనున్నారు. ఆగస్టు 01 – 2023 న రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.