GUEST JUNIOR LECTURER JOBS : నాగర్‌కర్నూల్ జిల్లా నోటిఫికేషన్

నాగర్‌కర్నూల్ (జూలై – 19) : తెలంగాణ ఇంటర్మీడియట్ కమీషనర్ ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న 67 జూనియర్ లెక్చరర్ పోస్టులను అతిధి అధ్యాపకుల చేత భర్తీ చేయడానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికా‌రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న 67 పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

తిమ్మాజిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్, ఇంగ్లీష్, బోటనీ,

కల్వకుర్తి జూనియర్ కళాశాలలో ఫిజిక్స్, ఇంగ్లీష్, జూవాలజీ, హిస్టరీ, సివిక్స్,

కొల్లాపూర్ బాలుర జూనియర్ కశాలలలో ఫిజిక్స్, ఇంగ్లీష్, బొటనీ, ఎకనామిక్స్, సివిక్స్,

కొల్లాపూర్ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు, కెమిస్ట్రీ, బోటనీ, ఎనామిక్స్,

కోడేర్ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్, ఇంగ్లీష్, బోటనీ, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జువాలజీ,

అచ్చంపేట బాలుర జూనియర్ కళాశాలలో మ్యాథ్స్, కెమిస్ట్రీ, బోటనీ, కామర్స్, ఎంఎల్నీ ఒకేషనల్, ఎంఎల్డీ ఒకేషనల్,

అచ్చంపేట బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీహెచ్ డబ్ల్యూ(ఎఫ్) ఒకేషనల్,

ఎస్వీ ప్రభుత్వ జూనియర్ పాలెం(2) కెమిస్ట్రీ, జువాలజి,

నాగర్ కర్నూల్ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు, కెమిస్ట్రీ, బోటనీ, మ్యాథ్స్, ఫిజిక్స్,

నాగర్ కర్నూల్ బాలుర జూనియర్ కళాశాలలో మ్యాథ్స్,కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సివిక్స్, ఫిజిక్స్, జువాలజీ, ఈటీ ఒకేషనల్,

తాడూర్ జూనియర్ కళాశాలలో తెలుగు, కెమిస్ట్రీ, బోటనీ, కామర్స్,

వెల్దండ జూనియర్ కళాశాలలో తెలుగు, బోటనీ,సివిక్స్,

తాడూర్ జూనియర్ కళాశాలలో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, జూవాలజి, ఎకనామిక్స్,

కొండనాగుల జూనియర్ కశాలలో హిస్టరీ, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్,

వంగూర్ జూనియర్ కళాశాలలో తెలుగు, ఫిజిక్స్ పోస్టులు కలవు

పీజీ‌ అర్హత కలిగిన అభ్యర్థులు నాగర్‌కర్నూల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికా‌రి కార్యాలయం యందు జూలై 24 సాయంత్రం 5.00 గంటల లోపల దరఖాస్తు చేసుకోగలరు.

పదో తరగతి నుంచి పీజీ వరకు సర్టిఫికెట్ లు, కులం & లోకల్ ఏరియా సర్టిఫికెట్ లతో దరఖాస్తు ఫారం సమర్పించాలి.

కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రిన్సిపాల్ లతో కూడిన కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

పీజీ లో సాదించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు సంబంధించిన కళాశాలలో ఆగస్టు 28 నాడు ఎంపిక జాబితా విడుదల చేయనున్నారు. ఆగస్టు 01 – 2023 న రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Comments are closed.