1130 గెస్ట్ లెక్చరర్ ల నియామకానికి ప్రతిపాదనలు

హైదరాబాద్ :: తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం కొత్తగా 1130 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. నియామకాల్లో నెట్, పీ.హెచ్.డీ ఉన్న వారికే తొలి ప్రాధాన్యమివ్వనున్నారు. పీజీ అర్హత గల వాళ్లను తీసుకునే అవకాశ ముండగా నెట్, పీ.హెచ్.డీ అర్హత గలవారు దొరకని పక్షంలో మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి అవకాశం కల్పించనున్నారు.

పలు డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో కళాశాలల నుంచి వివరాలను తెప్పించిన అధికారులు 1130 గెస్ట్ అధ్యాపకులు అవసరమని తేల్చారు. వీటికి అనుమతి కోరుతూ పై అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఒక ట్రెండు రోజుల్లో ఆయా పోస్టులను మంజూరుచేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Follow Us @