హిందూ కోడ్ బిల్లు మహిళల స్వేచ్ఛ కు ప్రతీక

  • మబ్బు పరశురాం,లెక్చరర్, దళిత రత్న అవార్డు గ్రహీత

BIKKI NEWS : ఫిబ్రవరి 5 వ తేదీ 1951 సంవత్సరం లో అంబేడ్కర్ స్త్రీలకు మేలు చేసే హిందూ కోడ్ బిల్లును (hindu code bill) పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. ఈ దేశం లో స్త్రీ స్వేచ్ఛ కు స్త్రీ శ్రేయస్సు కు పాటు పడిన స్త్రీ దాస్య విమోచకుడు డా.బి ఆర్ అంబేడ్కర్. హిందూ కోడ్ బిల్లు రచించి ఆ బిల్లు మరియు బిసీ రిజర్వేషన్లు గురించి పార్లమెంటులో ప్రవేశ పెట్టగా నెహ్రూ కేబినెట్ ఈ రెండు బిల్లులకు వ్యతిరేకంగా అడ్డుతగలగా తన కేంద్ర న్యాయ శాఖా మంత్రి పదవినే తృణప్రాయంగా వదిలేసుకున్నారు. ఈనాడు మహిళలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారంటే , స్వేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నారన్నా , మహిళా రిజర్వేషన్లుకు ఆద్యుడు,మహిళలకు మెటర్నటీ సెలవులు,ప్రత్యేక సౌకర్యాలు ఒకటేమిటి సమస్త మానవులు ఈ దేశంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే అది అంబేడ్కర్ గారి త్యాగ ఫలితం.

హిందూ కోడ్ బిల్లు

1950 నాటికే అంబేడ్కర్ భారతదేశానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాది గా గల స్త్రీ పురుషులకు సమాన హక్కులు, సమాన పౌర హక్కులు, ఓటు హక్కులు, పాలనా హక్కులు ఇచ్చే భారత రాజ్యాంగాన్ని విశ్వరత్న అంబేడ్కర్ రచించారు.

భారత రాజ్యాంగం రచించడం కోసం అంబేడ్కర్ ఎంతగా శ్రమించారో మహిళల కోసం హిందూ కోడ్ బిల్లు రచించడం కోసం అంతే శ్రమించారు.1950 డిసెంబర్ వరకూ ఈ హిందూ కోడ్ బిల్లు అమలుకు నోచుకోలేదు. దీంతో అంబేడ్కర్ 39 పేజీల పుస్తకం రచించి పార్లమెంట్ లో పంచారు,పార్లమెంట్ సభ్యులను ఆలోచన చేయమని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నెహ్రూ కు 1951 ఆగస్టు 10 న ఒక లేఖ ద్వారా అంబేడ్కర్ హిందూ కోడ్ బిల్లు పై ఆగస్టు16 చర్చ జరిపి సెప్టెంబర్ 1 న ఆమోదించడానికి సహకరించమని తెలిపారు. నెహ్రూ దీనికి సుముఖత వ్యక్తం చేశారు.భారత న్యాయశాఖ మంత్రి గా అంబేడ్కర్ హిందూ ధర్మ శాస్త్రాన్ని మారుతోన్న కాలానికి అనుగుణంగా ప్రపంచ పద్ధతులను గమనించి హిందూ సమాజంలో మార్పులు రావాలని ఆశించారు.1951 ఫిబ్రవరి 5 న హిందూ కోడ్ బిల్లు పార్లమెంటు లో చర్చ కు వచ్చింది. ఆనాటి కేంద్ర మంత్రి ఎస్.వి.గాడ్గిల్ అంబేడ్కర్ ను మహర్షి ,అభినవ మనువు అని కొనియాడారు. దుర్గాబాయ్ దేశ్ ముఖ్ హిందూ కోడ్ బిల్లు ను సమర్థిస్తూ “అంబేడ్కర్ స్త్రీ దాస్య విమోచకుడు” అని కొనియాడింది. హెచ్.వి.కామత్, కృపాలినీ మొదలైన అభ్యుదాయకులు హిందూ కోడ్ బిల్లును సమర్థించారు.

1951 సెప్టెంబరు 17 న వేలాది మంది స్త్రీలు హిందూ కోడ్ బిల్లు యధాతథంగా అమలు జరపాలని పార్లమెంటు ముందు నినాదాలు చేశారు. పలు చోట్ల మహిళలు హిందూ కోడ్ బిల్లు కోసం తీర్మానాలు చేశారు. అంబేడ్కర్ 1951 సెప్టెంబర్ 27 న నెహ్రూ ఇచ్చిన మాటపై నిలబడకుండా హిందూ కోడ్ బిల్లు అమలు చేయలేదు దీంతో అంబేడ్కర్ తీవ్ర మనస్తాపానికి గురై తన మంత్రి పదవికి రాజీనామా చేసారు.

హిందూ కోడ్ బిల్లు లో ఏముంది.?

హిందూ కోడ్ బిల్లు లో అన్ని మతాల మహిళలకు సమానత్వం ఉంది.

హిందూ కోడ్ బిల్లు లో వివాహం, విడాకులు, దత్తత, తల్లిదండ్రులలో ఎవరైనా మరణించినప్పుడు, స్త్రీ ఆస్తిహక్కు,జీవనభృతి హక్కులు, కూతురు హక్కు,భార్య హక్కు, కోడలు హక్కు, తల్లిదండ్రుల హక్కులు మొదలైనవి ఎన్నో పురుషాధిక్యత నుండి మహిళలకు మేలు చేసేవి ఉన్నాయి.

భారత దేశ మహిళాల సమానత్వం గురించి ఆలోచించిన వ్యక్తి ఒక్క “అంబేడ్కర్”గారు మాత్రమే. 1951 ఫిబ్రవరి 5 న హిందూ కోడ్ బిల్ ను ప్రవేశ పెట్టారు. అందులోని ముఖ్యాంశాలు..

మగపిల్లలకు ఆస్తిలో ఎంత హక్కు ఉన్నదో ఆడపిల్లలకు అంతే హక్కు ఉండాలి.
పిల్లలను దత్తత తీసుకునే హక్కును,దత్తత ఇచ్చే హక్కును కల్పించాలి.
దత్తత విషయంలో దత్తత తీసుకోబడిన వారితోపాటు దత్తత తీసుకున్న తల్లికి కూడా ఆస్తిలో భాగం ఉండాలి.
బహు భార్యత్వం రద్దు.

మబ్బు పరశురాం,లెక్చరర్
దళిత రత్న అవార్డు గ్రహీత
9703648173