మల్కాజ్గిరి కళాశాలలో ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు

మల్కాజ్గిరి/నేరేడ్మెట్ (సెప్టెంబర్ – 14) : ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్కాజిగిరిలో ఈరోజు హిందీ అధ్యాపకులు డాక్టర్.గోపి ఆధ్వర్యంలో ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కళాశాలలో హిందీ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన,ఉపన్యాస పోటీలు నిర్వహించి విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిర్మయి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది.


ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ హిందీ భాష యొక్క గొప్పతనాన్ని స్వదేశంలోనే కాక విశ్వభరితంగా హిందీ భాష మాట్లాడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, దేశ భాషగా హిందీ ఔన్నత్యాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందితోపాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.