కాంట్రాక్టు ఉద్యోగులు/లెక్చరర్ లకు శుభవార్త

కాంట్రాక్టు ఉద్యోగులు మరియు లెక్చరర్ల క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా 2016 లో writ no- 14890 కేసులో నక్కల గోవింద్ రెడ్డి మరియు జాటోత్ శంకర్ మరియు 23 మంది తరుపున హైకోర్టు నందు కేసు వేయడం జరిగింది .

ఈ కేసులో లెక్చరర్ ల తరఫున లాయర్ జీ.వీ.ఎల్. మూర్తి వాదించడం జరిగింది, ఈరోజు కొద్దిసేపటి క్రితం హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచి లో జరిగిన వాదనలో నక్కల గోవింద్ రెడ్డి మరియు జాటోత్ శంకర్ వేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది, ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు అపరాధ రుసుము ను రెండు వారాల్లో హైకోర్టు చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది.

అదేవిధంగా త్వరలో హైకోర్టులో జరగబోయే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో 16 మీద వేసిన కేసు విషయంలో కూడా న్యాయం జరిగి తీరుతుందని ఆశిస్తున్నట్లు కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us @