GROUP 1 PRELIMS రద్దు పై తీర్పు రిజర్వ్

హైదరాబాద్ (ఆగస్ట్ – 04) : GROUP – 1 PRELIMS పరీక్ష రద్దు కోరుతూ హైకోర్టు లో దాఖలైన పిటిషన్లపై గురువారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేశారు. బయోమెట్రిక్ లేకుండా నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలని ప్రశాంత్ తో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ పి. మాధవీ దేవి గురువారం విచారణ చేపట్టారు.

లీకేజీ నేపథ్యంలో రద్దయిన గ్రూపు-1 పరీక్షలను రెండోసారీ అంతే లోపాలతో నిర్వహించారని, ఆ పరీక్షలను రద్దు చేయాలంటూ పిటిషనర్ల తరపున న్యాయ వాదులు గిరిధర్ రావు, నర్సింగ్ వాదనలు వినిపించారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను 2,33,248 మందిగా పేర్కొన్నారు. వెబ్సైట్ లో మాత్రం 2,33,506గా చూపుతున్నారు. గ్రూపుశ- 4 పరీక్షల్లో బయోమెట్రిక్ తీసుకున్నారు. అంతకుముందు నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో మాత్రం ఈ విధానాన్ని అమలు చేయలేదు. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది’ అన్నారు.

కమిషన్ తరపున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ వాదనలు వినిపించారు. 2 లక్షల మందికి పైగా పరీక్షలు రాయగా, పిటిషనర్లు తప్ప ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. పరీక్షలు పటిష్ఠంగా నిర్వహించామనేందుకు ఇదే నిదర్శనం’ అని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.