విద్యా సంస్థల ప్రారంభం పై హైకోర్టు కీలక ఆదేశాలు

సెప్టెంబర్ ఒకటి నుండి తెలంగాణలోని విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మీద హైకోర్టు స్టే విధించింది. వారం రోజుల పాటు స్టే కొనసాగనుంది.

ఇప్పుడే పాఠశాలను భౌతికంగా ప్రారంభించవద్దని స్పష్టం చేసింది. ప్రత్యక్ష తరగతులకు హాజరు కావాలని విద్యార్థులను బలవంత పెట్టొద్దని, గురుకులాలు, హాస్టల్ ఇప్పుడే ప్రారంభించ వద్దని తెలిపింది.

విద్యార్థులను ప్రత్యక్ష బోధనకు హజరు కావడం అనేది వారి ఇష్టానికి వదిలి వేయాలని, ఆన్లైన్, ఆప్లైన్ బోధన పద్దతులు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

వారంలో గా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేయాలని విద్యా శాఖ ను హైకోర్టు ఆదేశించింది.

తదుపరి విచారణను సెప్టెంబర్ 4 వ తేదీ న చేపట్టాలని నిర్ణయం