POLICE JOBS RESULTS : EWS కోటా తేలాకే ఫలితాలు – హైకోర్టు

హైదరాబాద్ (ఆగస్ట్ – 04) : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష ఫలితాల ప్రక్రియ దాదాపు పూర్తయింది. తుది ఫలితాలను విడుదల చేయడానికి ముందు EWS రిజర్వేషన్ల కోటాపై స్పష్టత ఇవ్వాలని, స్పష్టతను ఇచ్చాకనే ఫలితాలు విడుదల చేయాలని హైకోర్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది.

జీవో నెంబర్ 57, 58 పై అభ్యంతరం తెలుపుతూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా… హైకోర్టు ఈ మేరకు తీర్పును ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్ట్ 17వ తేదీన చేపట్టనున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో ఆగస్టు చివరి వారంలో సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షా ఫలితాలు, సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.