VRA : సర్దుబాటు జీవో పై స్టే

హైదరాబాద్ (ఆగస్టు – 10) : విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (VRA)లను జూనియర్ అసిస్టెంట్లుగా ఎలా నియమిస్తారని.. వారి నియామకం సమంజసం కాదంటూ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినేట్లు హైకోర్టులో పిటిషన్ ను పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు సర్దుబాటు జీవో పై స్టే విధించింది.

వీఆర్ఎలను జూనియర్ అసిస్టెంట్, ఇతర పోస్టుల్లో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 81 జారీ చేసిన విషయం తెలిసిందే. ఇది చట్టవిరుద్ధమని ముందుగా తమ పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని, ఆ తర్వాతే వీఆర్ఎల నియామక అంశాన్ని పరిశీలించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోర్ట్ లో కేసు వేసిన సంగతి తెలిసిందే.