BIKKI NEWS (NOV. 19) : High court final verdict on contract employees regularization. తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను, లెక్చరర్ లను క్రమబద్ధీకరించడం కోసం గత ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 16 మీద ఈరోజు రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
High court final verdict on contract employees regularization
జీవో నెంబర్ 16 సవాలు చేస్తూ కొంత మంది నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు తుది వాదనలను విన్న హైకోర్టు తుది తీర్పును ప్రకటించింది.
ఈ తీర్పు ప్రకారం జీవో నెంబర్ 16 లోని పేరా 4B ని మాత్రమే కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఉద్యోగనియామక చట్టాన్ని సవరించడం ద్వారా సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన ఆ జీవోను కొట్టివేసింది.
జీవో నంబరు 16 ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యాక్ట్ 2 ఆఫ్ 1994 ను స్వీకరిస్తూ అందులో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించుకోవచ్చు అంటూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
తుది తీర్పు ప్రకారం 16 జీవో ఆత్మను కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకనుండి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. కచ్చితంగా ఖాళీలను నోటిఫికేషన్ల ద్వారా సమాన అవకాశాలను కల్పిస్తూ భర్తీ చేయాలని పేర్కొంది.
అలాగే ఇప్పటికే క్రమబద్ధీకరించబడిన ఉద్యోగులను మరియు లెక్చరర్లను తొలగించవద్దని వారిని యాధాతధంగా కొనసాగించాలని స్పష్టం చేసింది.
ఈ తీర్పు పట్ల నిరుద్యోగులకు కాస్త ఊరట లభించినట్లయింది. అలాగే రెగ్యులర్ కాబడిన కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఊరట లభించింది.