క్రమబద్ధీకరణ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన వెంకన్న, కుమార్

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 పై నిరుద్యోగులు వేసిన పిల్ నంబర్ 122 ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో వెంకన్న, కుమార్ లు హర్షం వ్యక్తం చేశారు.

ఇందుకు కోసం సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా వెంకన్న, కుమార్ లు మాట్లాడుతూ క్రమబద్ధీకరణ కు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరణ ప్రక్రియను మొదలు పెట్టాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల జీవితాలలో వెలుగులు నింపాలని విన్నవించుకున్నారు.

ఈ తీర్పు పట్ల 508 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి గాదె వెంకన్న, యార కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

Follow Us @