ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మంజూరైన లెక్చరర్ పోస్టులు రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయకుండా కాంట్రాక్టు, అతిధి లెక్చరర్లను కోనసాగిస్తున్నారంటూ, కాంట్రాక్టు/అతిధి లెక్చరర్ లను ఏడాది కంటే ఎక్కువ కాలం కొనసాగించరాదని హైకోర్టులో కరీంనగర్ జిల్లాకు చెందిన జె. శంకర్, కె.బాలకృష్ణ గతంలో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.
ఈ PIL గురువారం మరోసారి విచారణకు వచ్చింది. కాంట్రాక్టు/అతిధి లెక్చరర్లను ఏడాది కంటే ఎక్కువ కాలం కొనసాగించడానికి వీల్లేదన్న పిటిషనర్ తరఫు వాదనపై స్పందించిన ధర్మాసనం.. అలా నిబంధనలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. నిబంధనలుంటే కోర్టుకు ఇవ్వాలని పిటిషనర్‌కు సూచించింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. కేసు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.