Home > UNCATEGORY > జీజేసి హయత్ నగర్ విద్యార్థులకు ఉచితంగా పొలిటికల్ సైన్స్ స్టడీ మెటీరియల్ పంపిణీ

జీజేసి హయత్ నగర్ విద్యార్థులకు ఉచితంగా పొలిటికల్ సైన్స్ స్టడీ మెటీరియల్ పంపిణీ

BIKKI NEWS (JAN. 10) : Hemachander supplied free study material for GJC Hayath Nagar Students. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హైదరాబాద్, డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య గారు ఉత్తీర్ణత శాతం పెంచడం కోసం 90 రోజుల ప్రణాళిక రూపొందించి విద్యార్థులు 100% ఉత్తీర్ణతా శాతం సాధించే విధంగా కృషి చేయాలని ఆదేశాలను ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ వెంకీయ నాయక్ గారు ఇటీవల కళాశాలను సందర్శించిన సందర్భంలో విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణత శాతం అధ్యాపకుల కృషి చేయాలని 90 రోజుల యాక్షన్ ప్లాన్ విద్యార్థులకు అందజేయాలని అదేవిధంగా ఉత్తీర్ణత శాతం పెంచడం కోసం అధ్యాపకులు విశేష కృషి చేయాలని అందుకోసం అనుసరించాల్సిన పద్ధతుల గురించి అనేక సూచనలు చేశారు.

Hemachander supplied free study material for GJC Hayath Nagar Students

దానిలో భాగంగా ఈరోజు కళాశాలలో పొలిటికల్ సైన్స్ స్టడీ మెటీరియల్ ని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎన్ సంజీవరెడ్డి మరియు సీనియర్ అద్యాపకులు వెంకటేశ్వర్లు గార్ల చేతుల మీదుగా విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మా కళాశాల యందు రాజనీతి శాస్త్రం బోధించే అధ్యాపకుడు మారం హేమచందర్ ఉత్తీర్ణత శాతం పెంచడం కోసం సులభ శైలిలో వారే స్వయంగా రూపొందించి ఈ మెటీరియల్ విద్యార్థులకు ఉచితంగా అందజేయడం చాలా సంతోషంగా ఉందని సులభశైలిలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా రూపొందించిన ఈ స్టడీ మెటీరియల్ ఉత్తీర్ణశాతం పెంచడానికి దోహదపడుతుందని.. అదేవిధంగా కళాశాలలో ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న సుమారు 200 మందికిపైగా విద్యార్థులందరికీ రాజనీతి శాస్త్రం స్టడీ మెటీరియల్ ని ఉచితంగా అందజేసిన రాజనీతి శాస్త్రం అధ్యాపకుడు ఎం. హేమచందర్ కృషిని వారు ఈ సందర్భంగా అభినందించారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు