కరోనా నేపథ్యంలో సీజేఎల్స్ సమస్యలపై చర్చించిన సూర్యాపేట జిల్లా 711 సంఘం

కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న కారణంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై ఈ రోజు TGCCLA-711 సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎం. హేమ చందర్ రెడ్డి అధ్యక్షతన జరిగినది. ఈ జూమ్ మీటింగ్ కు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ జానాపాటి కృష్ణయ్య గౌరవ అతిథిగా హజరయి ఈ జూమ్ మీటింగ్ నందు పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ Covid-19 బారిన పడిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు ఆత్మహత్యలు చెసుకోవద్దని దైర్యంగా ఉండాలని విలువైన సలహాలు, సూచనలు చేసి జిల్లాలోని కాంట్రాక్ట్ అధ్యాపకులకు మనో ధైర్యాన్ని కల్పించారు.

TGCClA-711 రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం ముఖ్య అతిథిగా ఈ సమావేశంలో జాయిన్ అయి మాట్లాడుతూ జిల్లా కమిటీ అందరితో చర్చించి తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నవి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెళ్లి వాటి అమలుకు కృషి చేస్తానని అన్నారు.

అవి:

  1. ప్రభుత్వ సహకారంతో మరణించిన కాంట్రాక్ట్ అధ్యాపక కుటుంబాలకు అందరి వేతనాల నుంచి 1లేదా 2 రోజుల వేతనం కట్ చేయించి ఒక నిధి ఏర్పాటు చేసి ఆర్ధిక సహాయం లేదా గ్రూప్ ఇన్సూరెన్సు సౌకర్యాన్ని కల్పించడం.
  2. బదిలీలు తప్పకుండా ఈ విద్యా సంవత్సరం నందు జరుగుతాయి.
  3. కరోన బారిన పడిన వారు దైర్యంగా వుండాలి.
  4. నెల నెలా వేతనాలు త్వరలో వస్తాయి.
  5. మార్చి వేతనంకు సంబంధించి ఈ నెల 20 వరకు ప్రొసీడింగ్ వచ్చే అవకాశం ఉంది.
  6. న్యూ పిఆర్సీకి సంబంధించి ఉత్తర్వులు కొద్దిగా ఆలస్యం అయిన ఎప్రిల్ నుంచే పెరిగిన వేతనాలు వర్తిస్తాయి.

ఈ కార్యక్రమంలో TGCCLA-711 రాష్ట్ర ఆర్గనైసింగ్ సెక్రటరీ ముద్దం సిద్ధారెడ్డి, రాష్ట్ర నాయకులు జిల్లా నర్సింహ,
నందిగామ ఈశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనపర్తి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొల్లు శ్రీనివాస్, ఉపేందర్, బల భీమరావు, కుమార స్వామి‌, ఫుల్లయ్య , గణేశ్ ,ప్రదీప్, దయాకర్, రమేష్ శర్మ , శ్రీమతి రత్నకుమారి, మహేష్, నాగుల్ మీరా, రమణా రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొని అమూల్యమైన సలహలు సూచనలు ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షుడు హేమచందర్ రెడ్డి అందరికి
హృదయ పూర్వక ధన్యవాదాలు తెెెలియజేేేశారు.

Follow Us@