బేసిక్ పే వర్తింపు పై హరీష్ రావుకి కృతజ్ఞత తెలిపిన హేమచందర్ రెడ్డి

కాంట్రాక్ట్ అధ్యాపకులకు నూతన పిఆర్సి వర్తింప జేసిన ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్ కి కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను ఎప్పటికీ అప్పుడు నిరంతరం పరిష్కరిస్తున్న ఆపద్బాంధవుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరిశ్ రావు ఈ రోజు సిద్దిపేట లోని రెడ్డి ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ & అధ్యాపకుల కృతజ్ఞత అభినందన సభకు తెలంగాణ ప్రభూత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGCCLA)-711 సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మారం హేమచందర్ రెడ్డి హాజరై ఆర్ధికమంత్రి హరీష్ రావుకి పూల బొకే అందించి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

711 సంఘము రాష్ట్ర అధ్యక్షుడు డైనమిక్ లీడర్ కనకచంద్రం ఇచ్చిన పిలుపు మేరకు కాంట్రాక్ట్ లెక్చరర్స్ హేమచందర్ రెడ్డి, జి. నవీన్, రాష్ట్ర నాయకులు నందిగామ ఈశ్వర్, మందడి వెంకట్ రెడ్డి జిల్లా నాయకులు బి.ఎన్. రాజు, రాజోలు రమేష్ శర్మ , షేక్. నాగుల్ మీరా , జి. నాగరాజు, టి .ఉపేందర్, జి.నగేష్ తదితరులు ఈ రోజు సిద్దిపేట గడ్డపై జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి జిల్లా నుంచి భారీ సంఖ్యలో హాజరు కావడం జరిగింది.

Follow Us@