మానవాబివృద్ది సూచికలో పడిపొయిన భారత్ ర్యాంక్

ఐక్యరాజ్య సమితి అబివృద్ది కార్యక్రమం (UNDP) తాజాగా మానవాబివృద్ది సూచిక (HDI) – 2020 పేరిట విడుదల చేసిన నివేదిక లో భారత్ 131వ స్థానాన్ని (0.645 పాయింట్లు) పొందింది. గతేడాది మన ర్యాంక్ 130.

189 దేశాలకు గాను మానవాబివృద్ది సూచికను 2020 సంవత్సరానికి UNDP విడుదల చేసింది. ఇందులో నార్వే కు మొదటి స్థానం దక్కింది.

ఐర్లాండ్, స్విట్జర్లాండ్, హంకాంగ్, ఐస్ ల్యాండ్ మొదటి ఐదు స్థానాలలో నిలిచాయి. నైగర్ కు చిట్టచివరి స్థానం దక్కింది.

భారతీయుల సగటు ఆయుర్ధాయం 69.7 సంవత్సరాలుగా పేర్కొంది.

సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం లో భారత్ కి 5వ స్థానం దక్కింది.

మానవాబివృద్ది సూచికను పాకిస్థాన్ ఆర్థిక వేత్త మెహబూబ్ఉల్ హక్ మరియు ఆమర్త్యసేన్ సంయుక్తంగా రూపొందించారు.

పూర్తి నివేదిక కోసం వెబ్సైట్ ను సందర్శించండి

Follow Us @