JOBS -ఇంటర్‌ పూర్తయితే HCLలో ఉద్యోగాలు – విద్యాశాఖ

BIKKI NEWS (JUNE 15) : HCL JOBS FOR INTERMEDIATE STUDENTS. ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు ఐటీ సేవలకు తోడ్పడే డిజిటల్‌ సపోర్ట్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఏడాది శిక్షణ తర్వాత వారు హెచ్‌సీఎల్‌లో పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమితులవుతారని ఇంటర్‌ విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అర్హతలు

ఇంటర్‌ సీఈసీ, హెచ్‌ఈసీ, బైపీసీ, ఒకేషనల్‌లో 75 శాతానికిపైగా మార్కులు తప్పనిసరని, దరఖాస్తు చేసుకున్న వారికి హెచ్‌సీఎల్‌ కెరియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారని పేర్కొంది. ‘ప్రతిభ చూపిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైతే కమ్యూనికేషన్‌ టెస్ట్‌ ఉంటుంది. ఈ మూడు ప్రక్రియల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాన్ని అందజేస్తారు.

HCL CENTERS

మధురై, చెన్నై హెచ్‌సీఎల్‌ కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. మొదటి మూడు నెలలు తరగతి గది శిక్షణ, తర్వాత తొమ్మిది నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. స్టైపెండ్‌ కింద నెలకు రూ.10 వేలు ఇస్తారు.

ఆసక్తి ఉన్న వారు 7981834205, 9063564875, 8341405102లో సంప్రదించవచ్చని ఇంటర్‌ విద్యా శాఖ సూచించింది.

HCL JOBS FOR INTERMEDIATE STUDENTS

FOLLOW US @ TELEGRAM

LATEST CURRENT AFFAIRS IN TELUGU