కేసీఆర్ కి కృతజ్ఞత సభలో హరీష్ రావు స్పీచ్ హైలెట్స్

కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ ఆద్వర్యంలో సిద్దిపేట లో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత సభ ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు స్పీచ్ హైలెట్స్

 • కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 16 పై కోర్టులో ఉన్న కేసు విషయం త్వరలోనే ఏజీ తో మాట్లాడి కేసు వెకేట్ కి ప్రయత్నం చేస్తాం.
 • సీఎం కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడి కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల బదిలీల మీద నిర్ణయం తీసుకుంటాం.
 • నెల నెల వేతనాలు వచ్చేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.
 • రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అన్ని రకాల సెలవులు & మహిళ కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రసూతి సెలవులు విషయంలో నిర్ణయం తీసుకుంటాం.
 • డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో డిస్టర్బ్ అయిన అధ్యాపకుల పునర్నియామకానికి చర్యలు తీసుకుంటాం.
 • కరోనా కారణంగా మరణించిన కాంట్రాక్ట్ అధ్యాపకుల కుటుంబాలను ఆదుకుంటాం.
 • 4వేల కోట్లతో పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టబోతున్నాం.
 • సీఎం కేసీఆర్ ప్రభుత్వ విద్య, వైద్యాన్ని కార్పొరేట్ స్థాయిలో అబివృద్ది చేయడానికి కృషి చేస్తున్నారు.
 • కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేసే ఖాళీలను ఉద్యోగ నియమాకాలలో ఖాళీలుగా చూపించం.
 • కాంట్రాక్ట్ అధ్యాపకులకు సొంత తోబుట్టువుల తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుంది.
 • వేల కొద్ది పోస్టుల శాంక్షన్ చేశాం, 12 నెలల వేతనం, బేసిక్ పే కల్పించాం.
 • కాంట్రాక్ట్ అధ్యాపకుల చిన్నచిన్న సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తాం.
Follow Us @