జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాంట్రాక్టు అధ్యాపకులతో రేపు హరీష్ రావు భేటి – కనకచంద్రం, వినోద్

తెలంగాణలోని రెండు పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల మరియు పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ సంఘాల ప్రతినిధులతో మార్చి 02న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం ఎర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశంలో సమస్యల పరిష్కారానికి ముందుండాలని సంఘాల ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకచంద్రం, కార్యదర్శి శేఖర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ లు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి బెనిఫిట్స్ గత ఎమ్మెల్సీ ఎన్నికల హామీ వల్లనే వచ్చాయి అని తెలిసిన విషయమే. ఈ అవకాశాన్ని కూడా మనకు సానుకూలంగా మార్చుకొని మన సమస్యలను పరిష్కరించుకుందామని, రేపు జరగబోయే సమావేశంలో మన సమస్యలైన ఉద్యోగ భద్రత, బదిలీ ల మార్గదర్శకాలు, 16 జీవోపై కోర్టు కేసు విషయంలో ప్రభుత్వ పాత్ర తదితర అంశాలపై చర్చించడం జరుగుతుంది.

Follow Us@