పోచారం అభయారణ్యంను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

మెదక్ జిల్లా పోచారం అభయారణ్యం పరిధిలో పోచంరాల్ వద్ద నిర్మించిన పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

చారిత్రక ప్రాధాన్యత కలిగిన పోచారం అభయారణ్యం ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో ఈ పర్యావరణ విజ్ఞాన కేంద్రం నిర్మాణం జరిగింది. కంపా నిధులు 43.23 లక్షలు, 20.00 లక్షల బయోసాట్ నిధులతో ఈ కేంద్రాన్ని నిర్మించారు.

అడవి, జంతువులు, పర్యావరణం ప్రాధాన్యత తెలిపేలా నమూనాలు (Exhibits) , సందర్శకుల వసతులను ఇక్కడ అటవీ శాఖ ఏర్పాటు చేసింది. దీని వలన ఉమ్మడి మెదక్, చుట్టు పక్కన జిల్లాలతో పాటు, రాష్ట్ర ప్రజలకు ప్రకృతి వన్య జీవుల పట్ల అవగాహణ కల్పించేలా నిర్మాణం జరిగింది.

Follow Us@