చేతుల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

BIKKI NEWS : హర్యానా రాష్ట్రంలోని అమృత ఆసుపత్రి అరుదైన ఘనత సాధించింది. చేతులు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులకు శస్త్రచికిత్స ద్వారా వేరేవారి చేతులను అమర్చి (hands replacement surgery in india) ఉత్తర భారతదేశంలో ఆ ప్రక్రియను పూర్తి చేసిన తొలి ఆసుపత్రిగా నిలిచింది*మ

దిల్లీకి చెందిన గౌతమ్‌ తాయల్‌ (64)కు పదేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి జరిగింది. రెండేళ్ల క్రితం ఓ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు పైభాగాన్ని కోల్పోయారు. తలకు గాయమై బ్రెయిన్‌ డెడ్‌ అయిన 40 ఏళ్ల వ్యక్తి నుంచి సేకరించిన చేతిని వైద్యులు 17 గంటల పాటు శ్రమించి గౌతమ్‌కు అమర్చారు. కిడ్నీ మార్పిడి జరిగిన వ్యక్తికి చేతిని అమర్చే ప్రక్రియ నిర్వహించడం దేశంలో తొలిసారి కాగా, ప్రపంచంలో రెండోదని వైద్యులు తెలిపారు

రెండు చేతులను అతికించడానికిగానూ రెండు ఎముకలు, రెండు ధమనులు, 25 స్నాయువులు(టెండన్స్‌), 5 నరాలను కలపాల్సి వచ్చిందన్నారు. గత డిసెంబరు చివరి వారంలో శస్త్రచికిత్స పూర్తయిందని, ప్రస్తుతం అతడు తన చేతి వేళ్లను కదిలించగలుగుతున్నాడని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు.. మూడేళ్ల క్రితం రైలు ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయిన దేవాన్ష్‌ గుప్తా (19)కి వైద్య బృందం చేతులను అమర్చింది. ఇందుకోసం బ్రెయిన్‌ డెడ్‌తో మరణించిన 33 ఏళ్ల వ్యక్తికి చెందిన చేతులను సేకరించారు.