BIKKI NEWS (AUG. 07) : Handloom Textile Diploma course admissions 2024. హైదరాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ – పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నందు (60) సీట్లకు (3) సంవత్సరముల చేనేత & టెక్స్టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.
Handloom Textile Diploma course admissions 2024
విద్యార్హతలు : పదవ తరగతి లేదా తత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై యుండవలెను.
వయోపరిమితి : జులై నెల 01వ తేదీ నాటికి బీసీ, ఓసి లకు 23 సంవత్సరముల వరకు యుండవలెను. (షెడ్యూల్ కులాలు/ షెడ్యూల్డ్ తెగలు వారికి 25 సంవత్సరముల వరకు)
దరఖాస్తు గడువు : ఆగస్టు 07 నుండి సెప్టెంబర్ 05 – 2024 వరకు
దరఖాస్తు విధానం : దరఖాస్తులను, పూర్తి చేసి తగు పత్రాలను జత చేసి కమిషనర్ (చేనేత జౌళి) శాఖ కార్యాలయము, చేనేత భవనము 3వ అంతస్తు నందు తేది: 05.09.2024లోగా సమర్పించవలెను.
వరకు ఇతర వివరములు మరియు దరఖాస్తు పొందుట కొరకు కింద ఇవ్వబడిన వెబ్సైట్ చూడగలరు.