ఎప్రిల్ 1 నుండి ఒంటి పూట బడులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏప్రిల్ 1వ తేదీ నుండి పాఠశాలలకు (1నుంచి 10వ తరగతి) ఒంటిపూట బడులు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఒంటి పూట బడుల సమయం ఉదయం 7.45 నుంచి 12.30 వరకు తరగతుల అనంతరం మధ్యాహ్న భోజనం ఎప్పటిలాగే ఉంటుందని పేర్కొన్నారు.

కరోనా కేసులు, ఎండల తీవ్రత కారణంగా ఒంటి పూట బడుల పై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Follow Us@