విజయవాడ (జూన్ 18) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు తగ్గకపోవడంతో ఒంటి పూట బడులను జూన్ 24 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు మాత్రమే పాఠాలు బోధించాలని.. ఉదయం 8.30
నుంచి 9 గంటల వరకు రాగిజావ పంపిణీ చేయాలని సూచించింది. ఉ.11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.