ఒప్పంద అధ్యాపకులకు ఆప్ డే లీవ్ మరియు వేతన సర్టిఫికెట్

తెలంగాణ ప్రభుత్వ  జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు ఇకనుండి ఆఫ్ డే లీవ్ మరియు శాలరీ సర్టిఫికెట్లను ఇవ్వవలసిందిగా ఇంటర్ కమిషనరేట్ మెమో జారీ చేసినది


19 సంవత్సరాలుగా కేవలం సంవత్సరానికి 10 క్యాజువల్ లీవ్ లతోనే విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులకు కమిషనరేట్ ఇంతవరకు రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా లీవ్ లను ఇవ్వక పోవడం శోచనీయం అలాగే మెటర్నిటీ లీవ్ కూడా మహిళా అధ్యాపకురాళ్ళకు కేవలం రెండు నెలలు వితౌట్ శాలరీ మాత్రమే కలదు.


అలాగే  శాలరీ సర్టిఫికెట్లను కూడా ఇంతవరకు కు ఇవ్వలేదు దానివలన బ్యాంకు లోన్స్ తదితర అంశాలలో చాలా నష్టం జరిగినది. ప్రస్తుతం శాలరీ సర్టిఫికేట్ ను ఇవ్వవలసిందిగా మెమో జారీ అయింది


ఆఫ్ డే లీవ్ మరియు శాలరీ సర్టిఫికెట్ లతో పాటు రెగ్యులర్ ఉద్యోగులు వలే పూర్తి సెలవులను కల్పించాలని మహిళా అధ్యాపకురాళ్ళకు మెటర్నిటీ లీవ్ విత్ పే కల్పించాలని అలాగే మొదటి తారీఖున శాలరీ చెల్లించాలని ప్రభుత్వానికి అధికారులకు ఒప్పంద అధ్యాపకుల సంఘాలు మనవి చేేశాాయి.

Follow Us @