119 బీసీ గురుకులాలు జూనియర్ కళాశాలలుగా అప్‌‌గ్రేడ్‌.

తెలంగాణ రాష్ట్రం‌లోని 262 బీసీ గురు‌కు‌లాల్లో 119 జూని‌యర్‌ కాలే‌జీ‌లుగా అప్‌‌గ్రేడ్‌ అవు‌తు‌న్నాయి. వచ్చే విద్యాసంవ‌త్సరం నుండి ఈ 119 గురు‌కు‌లాల్లో చదు‌వు‌తున్న 9,520 మంది విద్యా‌ర్థులు పదవ తరగతిని పూర్తి‌చేసి అదే ఆవరణలో ఇంట‌ర్మీ‌డి‌య‌ట్‌లో చేర‌బో‌తు‌న్నారు.

ఈ 119 కాలేజీలలో 20 కాలే‌జీల్లో వృత్తి విద్యా కోర్సుల‌ను ప్రవే‌శ‌పె‌డు‌తు‌న్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ఇప్ప‌టివ‌ర‌కు ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కే అందుబాటులో ఉండేవి. అయితే ప్ర‌భుత్వం తాజాగా వాటిని ఇంట‌ర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

Follow Us@