తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 121 మైనారిటీ గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని షెడ్యూల్డ్‌కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థ పాలకమండలి తీర్మానం చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో త్వరలో ఈ 121 పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా మారుతాయని కొప్పుల చెప్పారు.
జాతీయ పోటీ పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ చాటేందుకు వీలుగా 10 మైనారిటీ పాఠశాలలను సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌గా మార్చనున్నామని ఇందులో బాల, బాలికలకు ఐదేసి చొప్పున కేటాయించి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
Follow Us@