BIKKI NEWS (SEP. 15) : Gurukula principal suspension. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ పద్మ సస్పెన్షన్ కు గురైంది.
Gurukula principal suspension
ఈ మేరకు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవలే పాఠశాలలో పీఈటీ జ్యోత్స్న వేధింపులతో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో విధుల్లో నిర్లక్ష్యంతోపాటు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ప్రిన్సిపాల్ పద్మను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే పీఈటీ జ్యోత్స్నను విధుల్లోంచి తొలగించిన విషయం తెలిసిందే.