గురుకుల ప్రిన్సిపాల్ ఫలితాలు విడుదల చేయాలి.

గురుకుల ప్రిన్సిపాల్ ఫలితాలు విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ గురుకుల ప్రిన్సిపాల్ అభ్యర్థులు సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి గురుకుల ప్రిన్సిపాల్ అభ్యర్థులు వినతిపత్రం ఇచ్చారు.


దాదాపు 4 సంవత్సరాలు గడిచినా గురుకుల ప్రిన్సిపాల్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందని వారు ఆవేదన చెందారు. గురుకుల ప్రిన్సిపాల్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా ఉన్న కేసులను సాకు చూపుతూ జాప్యం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉద్యోగ ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించినా TSSP అలసత్వం వహిస్తుందని వారు విమర్శించారు.

గత 10 నెలల కాలం గా కరోనా వల్ల ఉపాధి కోల్పోయి దుర్బర జీవనం గడుపుతున్నామని వారు వాపోయారు. ఈ విషయంంలో ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి గురుకుల ప్రిన్సిపాల్ ఫలితాలు వెల్లడించేందుకు కృషిచేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ రాజేందర్, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Follow Us@