గురుకుల ప్రిన్సిపాల్ ఫలితాలు విడుదల చేయాలి – మంత్రులతో అభ్యర్థులు

2017లో విడుదల చేసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నోటిఫికేషన్ సంబంధించిన గురుకుల ప్రిన్సిపాల్ ఫలితాలు విడుదల చేయాలని కోరుతూ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఈ రోజు మంత్రులను కలిసి వినతిపత్రం అందచేశారు.

హైదరాబాద్ నాంపల్లిలో రూసా బిల్డింగ్ లో సోమవారం గురుకుల పాఠశాలలపై జరిగిన సమీక్ష సమావేశానికి హాజరైన వివిధ శాఖల మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లను కలిసి ఇందుకు సంబంధించిన వినతి పత్రాలు అందచేశారు.

నోటిఫికేషన్ విడుదల అయ్యి దాదాపు మూడున్నర సంవత్సరాలు గడిచినా, గురుకుల ప్రిన్సిపాల్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా ఉన్న కేసులను సాకు చూపుతూ జాప్యం చేస్తున్నారని వారు ఆవేధన చెందారు.

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉద్యోగ ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించినా, కోర్టు ఆదేశాల సైతం అమలు పరచడకుండా అలసత్వం వహిస్తూ, కాలయాపన చేస్తూన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరును వారు ఎండగట్టారు..

గత 10 నెలల కాలంగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడి, జీవితం, జీవనం రెండు కష్టమైన ఈ సమయంలో కనీసం ఈ ఉద్యోగం వస్తే కుటుంబాలు జీవితాలు నిలబడతాయని అందుకోసం ఉద్యోగ భర్తీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని కోరారు.

ఈ విషయంంలో ప్రత్యేక చొరవచూపి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఫలితాలు ఇప్పించగలరని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నీలిమా దేవి, వాణి, వాణిశ్రీ, రష్మీ, సునీత, డాక్టర్ అజయ్ కుమార్, బిక్షపతి, డాక్టర్ శ్రీనివాస్
విజయ్, తిరుపతి, శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us@