గురుకుల ప్రిన్సిపాల్ ఫలితాలు విడుదల చేయాలని -TSPSC ముందు అభ్యర్థుల ధర్నా


తమ ఫలితాల సాధన కోసం గురుకుల ప్రిన్సిపాల్ అభ్యర్థులు హైదరాబాద్ లోని TSPSC ఆఫీసు ముందు శనివారం ధర్నాకు దిగారు. నాలుగేళ్లుగా ఉద్యోగ నియమాకాలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అభ్యర్థులు ఆవేదన చెందారు. ప్రిన్సిపాల్ ఉద్యోగాలు ఇవ్వండి లేదా కారుణ్య మరణాలకు అవకాశం ఇవ్వండని వేడుకున్నారు.

కోర్టు కేసుల పేరుతో రిజల్ట్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని వారు విమర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెళ్లి నర్సిరెడ్డి గురుకుల ప్రిన్సిపాల్ అభ్యర్థుల ఆందోళన కార్యక్రమానికి సంఘిభావం ప్రకటించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కృష్ణా రెడ్డితో చర్చలు జరిపారు. ఈ నోటిఫికేషన్ పై పెండింగ్ లో ఉన్న 511 జడ్జీమెంట్ తీర్పు వచ్చిన తర్వాత ఫలితాల వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ కృష్ణా రెడ్డి హామి ఇచ్చారు.


దాదాపు 4 సంవత్సరాలు గడిచినా గురుకుల ప్రిన్సిపాల్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందని వారు ఆవేదన చెందారు. గురుకుల ప్రిన్సిపాల్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా ఉన్న కేసులను సాకు చూపుతూ జాప్యం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉద్యోగ ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించినా టీఎస్పీఎస్సీ అలసత్వం వహిస్తుందని వారు విమర్శించారు. గత 10 నెలల కాలంగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయి దుర్బర జీవనం గడుపుతున్నామని వారు వాపోయారు. ఈ విషయంంలో ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి గురుకుల ప్రిన్సిపాల్ ఫలితాలు వెల్లడించేందుకు కృషిచేయాలని వారు కోరారు.

Follow Us@