Home > EMPLOYEES NEWS > పదోన్నతులు, బదిలీలు తర్వాతే గురుకుల పోస్టింగ్స్!

పదోన్నతులు, బదిలీలు తర్వాతే గురుకుల పోస్టింగ్స్!

BIKKI NEWS (FEB. 18) : తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థలలో నూతన పోస్టింగ్ ఇవ్వటానికి ముందే పదోన్నతులు, బదిలీలు చేపట్టటానికి ప్రయత్నాలు (GURUKULA POSTINGS AFTER PROMOTIONS and TRANSFERS) జరుగుతున్నాయని టీఎస్డబ్ల్యూ, టీటీడబ్ల్యూ సంస్థల కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు.

గురుకుల జేఏసీ నేతలతో జరిగిన చర్చల్లో ఆమె ఈ మేరకు హామీనిచ్చారు. గురుకులాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు, బదిలీలు ఇవ్వకుండా నూతనంగా అపాయింట్మెంట్ పొందిన వారికి పోస్టింగ్ ఇవ్వటం వల్ల సీనియర్లు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.

ఈ అభిప్రాయంతో సంస్థ కార్యదర్శి ఏకీభవిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రమోషన్లు, బదిలీలు చేపట్టేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అన్ని అడ్డంకులను తొలగిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.