ప్రగతి భవన్ ముట్టడి

తెలంగాణ లోని 2018 పరీక్ష వ్రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తన్న గురుకుల పీఈటీ మహిళా అభ్యర్థులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ ముట్టడించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వరంగల్‌, నాగర్ కర్నూల్, మహాబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ నుంచి ఈ ముట్టడికి భారీగా అభ్యర్థులు తరలివచ్చారు.

2017లో నోటిఫికేషన్ ఇచ్చి 2018లో పరీక్ష రాశామని, 616 పోస్టులకు గాను 1232 మందిని సర్టిఫికెట్ ల వెరిఫికేషన్ కోసం పిలిచారని, పరీశీలన జరుగుతున్న సమయంలో కోర్ట్ ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చిందని నిరసన కు వచ్చిన వెంకటేష్, భాగ్యశ్రీ తెలిపారు.

2018 నుంచి గురుకుల పీఈటీ ఫలితాలు విడుదల చేయడంలేదని ఆందోళన చేస్తున్నామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసును ప్రభుత్వం కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా ఈ ముట్టడి కార్యక్రమం తలపెట్టారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Follow Us@