INTER – పరీక్ష లేకుండా గురుకుల ఇంటర్, డిగ్రీ అడ్మిషన్స్

BIKKI NEWS (DEC. 25) : Gurukula Inter and degree admissions without entrance test. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల సొసైటీల కింద ఉన్న ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాలలో ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు.

Gurukula Inter and degree admissions without entrance test

ఇప్పటికే ఎస్సీ గురుకులాలలో ఈ విధానం పై పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అవడంతో ఈ విధానం పై దృష్టి సారించారు.

ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించమని నేరుగా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకులాలలో ఇంటర్ మరియు డిగ్రీ ప్రవేశాలకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులందరికీ నేరుగా అడ్మిషన్లు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రవేశ పరీక్ష నిర్వహించి అడ్మిషన్లు కల్పించడంతో దాదాపు ఇంటర్మీడియట్ కళాశాలలో 30% సీట్లు, డిగ్రీ కళాశాలలో 50 శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

COE లకు మినహాయింపు

అయితే ఎప్‌సెట్, నీట్, జేఈఈ వంటి కోర్సులకు ఉచితంగా శిక్షణ అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో మాత్రం ప్రవేశ పరీక్ష ద్వారా మాత్రమే సీట్లు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లు 50 మాత్రమే ఉన్నాయి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు