దసరా సెలవులు తర్వాత గురుకుల హస్టల్స్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా
తగ్గుతుండడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలను తెరవనుంది. మొదటగా ఇంటర్మీడియట్ మరియు పై తరగతుల గురుకులాలను మరియు హస్టల్స్ ను ప్రారంభించాలని నిర్ణయించింది.

కొవిడ్ నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటూ విద్యార్థులకు వసతి కల్పించాలని ప్రభుత్వం జిల్లా సంక్షేమ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు దసరా పండగ తరువాత విద్యార్థులు బసచేసేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు. దీంతో గిరిజన, ఎస్సీ సంక్షేమ శాఖలు పోస్టుమెట్రిక్ గృహాలను తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి.