BIKKI NEWS (APRIL 12) : గురుకుల విద్యా సంస్థలలో ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీకి మరోసారి నియామక పరీక్షను తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహించాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ను రాష్ట్ర హైకోర్టు (gurukula art teacher exam must conduct in telugu medium also) ఆదేశించింది.
ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో జారీ చేసిన ట్రిబ్ నోటిఫికేషన్‌లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నది. ఆగస్టు 1న నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్షల్లో మాత్రం కేవలం ఇంగ్లిష్ మీడియం పేపర్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో పరీక్షకు తెలుగు మీడియం అభ్యర్థులు వేలల్లో హాజరయ్యారని, వారికోసం తెలుగులోనూ పరీక్ష నిర్వహించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. వాదనలు విన్న అనంతరం తిరిగి పరీక్ష నిర్వహించాలని ధర్మాసనం తీర్పునిచ్చింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా తెలుగులోనూ పేపర్ ఇవ్వాలని ఆదేశించింది