కేజీబీవీ ప్రత్యేక అధికారిణి తొలగింపు.

ముఖ్యమంత్రి కేసీఆర్ PRC ప్రకటన సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు బేసిక్ పే కలిపించకపోవడంపై నిరసనగా నాగర్ కర్నూలు జిల్లా కోడేరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిని గుంటి గోపిలత నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ చిత్రపటానికి తమ ఆవేదనను రక్తాభిషేకం చేస్తూ తెలియజేశారని అభియోగం మీద దీనిని ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావించి రాష్ట్ర విద్యా శాఖ విచారణకు ఆదేశించింది.

నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి కొమరయ్య పాఠశాలలో విచారణ నిర్వహించి డి ఈ ఓ గోవింద రాజులకు నివేదిక అందించారు. ఈ నివేదికను పరిశీలించి కలెక్టర్ శర్మన్ కు నివేదిక అందించారు. ఈ నివేదికను పరిశీలించిన కలెక్టర్ ప్రత్యేక అధికారి గుంటి గోపిలతను విధుల నుండి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Follow Us@