కేజీబీవీ టీచర్లకు ప్రసూతి సెలవులు కాదు బేసిక్ పే కల్పించాలి – గుంటి గోపిలత

తెలంగాణ రాష్ట్రంలో గల 475 కేజీబీవీలలో 10 వేలకు పైగా ఉద్యోగినులం పని చేస్తున్నాము. బాలికా సాధికారతే ధ్యేయంగా ఉన్న కస్తూర్భా పాఠశాలల్లో మహిళా సాధికారత లేకపోవడం శోచనీయమని గుంటి గోపిలత ఒక ప్రకటనలో తెలిపారు

గుంటి గోపిలత మాట్లాడుతూ 10% ఉద్యోగులకు కూడా వర్తించని ప్రసూతి సెలవుపై సారించిన దృష్టి 100% ఉద్యోగుల బేసిక్ పే మీద ముఖ్యమంత్రికి ఎందుకు లేదని ప్రశ్నించారు.2014 ఎన్నికల ముందు కేజీబీవీ ఆడబిడ్డలను చూస్తే గుండె తరుక్కుపోతుందని, శ్రమ దోపిడి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ వారిని రెగ్యులరైజ్ చేస్తానని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించి నేటికి కూడా రెగ్యులర్ చేయకపోగా కనీసం బేసిక్ పే కూడా ఇవ్వకుండా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కేజీబీవీ ఉద్యోగులకు బేసిక్ పే విషయంలో తీపికబురు చెప్పాల్సిందేనని, కేజీబీవీ టీచర్లను ఆదుకోవాల్సిందేనని, లేదంటే ఆయననే స్ఫూర్తిగా తీసుకుని ఈ వెట్టిచాకిరి, బానిస బతుకుల విముక్తి కోసం ఆమరణ నిరాహారదీక్ష చేయడానికి కూడా వెనకాడబోమని కేజీబీవీ ప్రత్యేకాధికారి,TSUTF రాష్ట్ర కమిటీ మెంబర్ గుంటి గోపిలత డిమాండ్ చేశారు.

Follow Us @