గుజరాత్ (జూన్ – 16) : బీపర్‌జాయ్ (BiparJoy Cyclone) తీవ్ర తుపాను గా మారి గుజరాత్ లోని (Gujarat cyclone) కచ్ ప్రాంతంలో తీరం దాటి భారీ వర్షాలకు కారణం అయింది. ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అరేబియా సముద్రంలో ప్రొరంభమైన ఈ తీవ్ర తుఫాను ప్రభావం పశ్చిమ భారతదేశం లో గుజరాత్, మహారాష్ట్ర మీద మరియు పాకిస్థాన్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఈ బీపర్‌జాయ్ తుపాను కారణంగా భారతదేశం లో రుతుపవనాలు విస్తరణ మందగించింది. దీంతో దక్కన్ పీఠభూమి ప్రాంతంలోకి రుతపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. దీంతో ఉష్ణోగ్రతలు భారీగానే నమోదు అవుతున్నాయి.