కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో మార్గదర్శకాలు

విజయవాడ (ఎప్రిల్‌ -27) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించామని, వాటిని వరుసగా పరిష్కరిస్తామని తెలిపారు. మే 1 నుంచి జీవోలు జారీ చేస్తామన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలోనే మార్గదర్శకాలు ఇస్తామని వెల్లడించారు. పీఆర్సీ కమిటీపై సీఎం జగన్ తో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీపీఎస్ రద్దుపై తర్వాతి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.