BIKKI NEWS (FEB. 06) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలలో ముఖ్యమైన రెండు గ్యారెంటీలైన 200 యూనిట్ ల వరకు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకం, 500/- రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం (గృహజ్యోతి) అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాల అమలుకు ప్రాథమికంగా రూపొందించిన మార్గదర్శకాలు. (Guidelines for fee current and 500/- gas cylinder)
ఫిబ్రవరి 8 నుండి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో తుది రూపం ఇచ్చి, నిధులు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాల అమలు కోసం ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 5 గ్యారెంటీల అమలుకై ప్రజాపాలన పేరిట దరఖాస్తు లు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుదారులలో అర్హులైన వారికి పథకాలు అందజేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ పథకాలకు కావాల్సిన అర్హతలు, కావాల్సిన పత్రాలు, పరిమితులపై కొన్ని మార్గదర్శకాలు ప్రాథమికంగా నిర్దేశించినట్లు సమాచారం. ఒకటి రెండు మార్పులతో ఈ మార్గదర్శకాలతోనే ఈ రెండు పథకాలు అమలు చేయనున్నారు.
★ మార్గదర్శకాలు
తెలంగాణ స్థానికత కలిగి ఉన్నవారికి మాత్రమే పథకాలు అమలు.
తెల్ల రేషన్ కార్డు, ఆహర భద్రతా కార్డు దారులకు మాత్రమే ఈ పథకాలు అమలు.
200 యూనిట్ ల లోపల విద్యుత్ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్.
500/- గ్యాస్ సిలిండర్ ల పథకంలో భాగంగా సంవత్సరానికి 6 సిలిండర్ లకే సదుపాయం.
అద్దెకు ఉంటున్న వారి పేరు మీదే మీటర్ కు ఉచిత విద్యుత్.
కచ్చితంగా విద్యుత్ మీటర్ ను మొబైల్ నంబర్ కు లింక్ చేసుకోవాలి.
నూతన రేషన్ కార్డులు జారీ తర్వాత వారికి కూడా పథకాలు అమలు
ప్రతి నాలుగు నెలలకోకసారి ప్రజాపాలనలో 6 గ్యారేంటీలకు దరఖాస్తులు స్వీకరణ
అర్హులైన అందరికీ పథకాలు అందేలా క్షేత్ర స్థాయిలో అధికారులతో పర్యవేక్షణ.
- GK BITS IN TELUGU MARCH 27th
- చరిత్రలో ఈరోజు మార్చి 27
- EAMCET, NEET, JEE FREE VIDEO CALSSES
- గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ
- GK BITS IN TELUGU MARCH 26th