దంపతుల బదిలీలపై మార్గదర్శకాలు

రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తున్న దంప‌తుల బ‌దిలీల‌కు సంబంధించి ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. భార్యాభ‌ర్త‌లు ఒకే చోట ప‌ని చేసేలా ప్ర‌భుత్వం ప‌రిశీల‌న చేస్తుంద‌ని మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొన్నారు. కొత్త జోన‌ల్ కేటాయింపుల్లో చేరిన త‌ర్వాతే స్పౌస్ కేసుల ద‌ర‌ఖాస్తులను ప‌రిశీలించ‌నున్నారు.

ముందు కొత్త పోస్టింగుల్లో చేరాకే అప్పీల్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. జిల్లా కేడ‌ర్ ఉద్యోగులు జిల్లా శాఖాధిప‌తికి అప్పీల్ చేయాలి. జోన‌ల్, మ‌ల్టీ జోన‌ల్ ఉద్యోగులు శాఖాధిప‌తికి అప్పీల్ చేయాలి. అప్పీళ్ల‌న్నీ సంబంధిత శాఖ కార్య‌ద‌ర్శికి సిఫార‌సు చేయాలి. పూర్తి విచార‌ణ త‌ర్వాత త్వ‌రిత‌గ‌తిన అప్పీళ్లు ప‌రిష్క‌రించాలి అని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.

Follow Us @